స్పెషల్ బస్సుల పేరుతో ఛార్జీల మోత
NEWS Dec 25,2024 09:01 am
మెదక్ లో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తుంది. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులను పూర్తిగా తగ్గించింది. కేవలం డీలక్స్ బస్సులను స్పెషల్ బస్సులు అంటూ నడిపిస్తుంది. అంతే కాకుండా నార్మల్ చార్జీలకంటే రెండు రెట్ల టికెట్లు ధరలను పెంచి నడుపుతోంది. దీంతో మెదక్ చర్చికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.