తప్పుడు పోస్టులు పెడితే తాట తీస్తాం
NEWS Dec 25,2024 08:46 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైద్రాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఏవీ ఆనంద్. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు విడుదల చేశామన్నారు. గీత దాటితే తాట తీస్తామని పేర్కొన్నారు. వీడియోలు పెట్టినా, కామెంట్స్ చేసిన కటకటాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.