మా సభ్యుల మధ్య ఐక్యత అవసరం
NEWS Dec 25,2024 08:20 am
మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే తెలుగు సినీ పరిశ్రమ ఎదిగిందని పేర్కొన్నారు. ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డి చెన్నై నుంచి హైదరాబాద్ కు రావడానికి కృషి చేశారని తెలిపారు. సున్నితమైన విషయాలపై మా సభ్యులు స్పందించ వద్దని కోరారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. మౌనంగా ఉండటమే మంచిదన్నారు.