మిల్లర్ల మోసాలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు
NEWS Dec 25,2024 07:30 am
నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ మోసాలపై వినియోగదారుల మండలి జాతీయ ప్రధానకార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సీసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ ఢిల్లీలోని కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. 41 మంది రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా కేంద్ర నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మిల్లర్లపై క్రిమినల్ కేసుల దాఖలుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 41 మిల్లుల్లో 9 రైస్‌మిల్లులు ఒక్కొక్కటి రూ.10 కోట్ల నుంచి రూ.58 కోట్ల వరకు బకాయి ఉన్నాయన్నారు.