నిజమైన భారత రత్నం వాజ్ పేయి
NEWS Dec 25,2024 06:28 am
భారత దేశం గర్వించ దగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సదైవ్ అటల్ దగ్గర నివాళులర్పించారు. వాజ్‌పేయి దూరదృష్టి కారణంగానే దేశ గతి మారిందన్నారు. ప్రపంచ దేశాలతో మన దేశం పోటీ పడుతోందన్నారు. వాజ్‌పేయితో పనిచేసిన అనుభూతి గుర్తుండి పోతుందన్నారు. దేశం గురించి వాజ్‌పేయి ఆలోచించే తీరు విలక్షణమైనదని పేర్కొన్నారు .