అప్పుల కుప్ప తప్ప చేసింది ఏముంది..?
NEWS Dec 25,2024 06:11 am
సంపద సృష్టిస్తామని ఉన్నదంతా దోచుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. కూటమి సర్కార్ బక్వాస్ అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, అప్పులు చేయడం తప్ప చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ఇప్పటికే రూ. 15,485 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు.