బ్లాక్ బెల్ట్‌కు ఎంపికైన కరాటే మాస్టర్
NEWS Dec 24,2024 03:45 pm
కరాటేలో అంతర్జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్కు మెట్ పల్లి మండలం బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ ఎంపికయ్యారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ మంగళవారం తెలిపారు. జనవరిలో హైదరాబాదులో జరగనున్న 50వ అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ పరీక్షకు ఇటీవల హైదరాబాద్ నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఆయన అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా అతడిని పలువురు అభినందించారు.