వరి నాట్లకు బీహారీ కూలీలు
NEWS Dec 24,2024 02:05 pm
తూప్రాన్: మెదక్ జిల్లాలోని రైతులకు రోజు రోజుకు కూలీల కొరత ఏర్పడుతోంది. మెదక్ జిల్లా గతంలో వ్యవసాయానికే పరిమితం అవ్వగా, జిల్లాలోని తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు గత పడేండ్లలో భారీ సంఖ్యలో పరిశ్రమలు వచ్చాయి. దీంతో గ్రామీణ ప్రాంత రోజు వారి కూలీలు పరిశ్రమలకు వెళ్తుండటంతో వ్యవసాయానికి కూలీల కొరత ఏర్పడింది. దీంతో కొంతమంది రైతులు కలిసి బీహార్ నుండి కూలీలను తెప్పించుకొని వరి నాట్లు వేస్తున్నారు. అంతే కాకుండా మరికొందరు బీహార్ కూలీలు తమ వద్ద ఉన్నారని వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు.