ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది తొలగింపు
NEWS Dec 24,2024 12:23 pm
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో అక్రమంగా నియామకాలు జరిపారని ఆరోపించారు. అవసరం లేకున్నా నియమించారని మండిపడ్డారు. ఎలాంటి ప్రామాణికత పాటించలేదని, కేవలం వైసీపీ నేతల సిఫారసులతో ఉద్యోగాలు పొందారని ఫైర్ అయ్యారు.