ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని చెప్పారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన పూర్తిగా రైతులకు వ్యతిరేకంగా పని చేసిందని ఆరోపించారు. వ్యవసాయ అభివృద్దికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం పనులను 72 శాతం పూర్తి చేశామన్నారు.