టీటీడీ పాలక మండలి సంచలన తీర్మానం చేసింది. కేవలం 2 గంటలలోనే భక్తులకు శ్రీవారి దర్శనం అయ్యేలా చేయాలని నిర్ణయించింది. ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై పాలక మండలి సభ్యులకు బెంగళూరుకు చెందిన సీట్రూ అండ్ ఏషియా అనే కంపెనీ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో ఇచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా త్వరితగతిన దర్శనం అయ్యేలా చేసేందుకు ఈవో కృషి చేస్తున్నారు.