సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరవుతారు. ఈ సందర్బంగా ఆయనను పోలీసులు మరోసారి విచారణ చేపడతారు. ఇప్పటికే చంచల్ గూడ జైలుకు వెళ్లారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇదే సమయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బన్నీ. ఆయనపై సీఎం నిప్పులు చెరిగారు.