తూప్రాన్ మున్సిపల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై-2 యాదగిరి తెలిపారు. పోతరాజుపల్లికి చెందిన వల్లపు అశోక్ (39) తన ద్విచక్ర వాహనంపై హైవేపై వెళ్తుండగా కరీంగూడ అండర్ పాస్ వద్ద ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. కాగా అశోక్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు.