బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి
NEWS Dec 24,2024 04:36 am
కామారెడ్డి ఎల్లారెడ్డి: బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాణాల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. గాంధారి పరిధిలోని 7 పోలింగ్ బూత్ లకు సోమవారం నూతన కమిటీలను నియమించారు. బూతుల వారీగా ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాయిబాబా, హోటల్ శ్రీనివాస్, మచ్చర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు