కొల్చారం మండలం సంగాయిపేట వద్ద విద్యుదాఘాతం సంగాయిపేట గ్రామానికి చెందిన రైతు మొక్కిరి మల్లయ్య (57) మృతి చెందాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశత్తు విద్యుదాఘాతం ఏర్పడడంతో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.