సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి నుండి విజ్ఞాన్ కాలనీ వెళ్లే దారి మొత్తం గుంతలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాలనీవాసులు అందరూ కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డికి విన్నవించారు. కాలనీ వాసుల ఇబ్బందిని గుర్తించి తక్షణమే స్పందించిన గోదావరి తన సొంత ఖర్చులతో కాలనీకి వెళ్లే రోడ్డకు మొరం పోయించి చదును చేయించారు.