ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షీతో భేటీ అయ్యారు. గాంధీ భవన్ లో తన అల్లుడి పట్ల రేవంత్త రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న కక్ష సాధింపు చర్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు సీఎం.