డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. మొన్నటికి మొన్న గిరిజన గూడేలలో పర్యటించారు. పాఠశాలలను పరిశీలించారు. పిల్లలతో ముచ్చటించారు. తాజాగా కృష్ణా జిల్లా గొడవర్రులో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన రహదారి పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఎక్కడ నాణ్యత లోపించినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం.