ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన
NEWS Dec 23,2024 09:08 am
నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను జిల్లా ప్రత్యేకాధికారులు పరిశీలించారు. నగరంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ప్రత్యేక అధికారులను నియమించారు. పలు డివిజన్లలో జరుగుతున్న సర్వేను ప్రత్యేకాధికారులు సత్యనారాయణ, శంకరయ్య బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి చిదుర రమేశ్‌తో కలిసి తనిఖీలు చేశారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ, కోటగల్లీ, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బలో బిల్ కలెక్టర్లు మొబైల్‌లో సర్వే వివరాలు సేకరించారు.