సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్లదు
NEWS Dec 23,2024 07:20 am
సినీ నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళుతుందనే ప్రచారం కరెక్ట్ కాదన్నారు. తాను ఇక్కడ డబ్బులు పెట్టానని, ఇళ్లు కట్టుకున్నానని అక్కడికి వెళ్లి ఏం చేస్తానంటూ ప్రశ్నించారు. సినీ రంగానికి సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సమానమేనని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో త్వరంలో సినీ రంగపు పెద్దలు కలుస్తారన్న విషయం తనకు తెలియదన్నాడు.