తిరుమల కిటకిట కాసులు గలగల
NEWS Dec 23,2024 06:34 am
భక్తులతో కిట కిట లాడుతోంది తిరుమల. 77 వేల 260 మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 24 వేల 223 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చిందని ఈవో వెల్లడించారు. ప్రస్తుతం భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనం కోసం 8 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.