అంగరంగ వైభవంగా పీవీ సింధు పెళ్లి
NEWS Dec 23,2024 05:54 am
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయి ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా పెళ్లి తంతును నిర్వహించారు. పండితుల వేదమంత్రాల నడుమ రాత్రి 11.20 గంటల సమయంలో సింధు మెడలో దత్తసాయి మూడు ముళ్లు వేశాడు.