సామాన్య భక్తులకు సులభంగా వసతి
NEWS Dec 23,2024 04:50 am
శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చే సామాన్య భక్తులకు తిరుమలలో సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని గరుడాద్రి నగర్ కాటేజీ వద్ద ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే నిర్వహించి మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు.