పల్లా..పురంధేశ్వరిపై పొన్నం ఫైర్
NEWS Dec 23,2024 04:35 am
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఏపీ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు, దగ్గుబాటి పురంధేశ్వరిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఢోకా లేదన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముందు మీ ఇల్లు చక్కదిద్దుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఎవరైనా సరే రూల్స్ కు విరుద్దంగా ప్రవర్తించినా, దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు.