అల్లు అర్జున్ ఇంటిపై దాడి దారుణం
NEWS Dec 23,2024 04:24 am
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కళాకారులు, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటివి జరగకుండా చూడాలన్నారు.