పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Dec 23,2024 04:31 am
నిజాంసాగర్‌లోని జవహార్ నవోదయ విద్యాలయంలో ఆదివారం 1993- 94 ఆరో తరగతి బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆనాటి మిత్రులందరూ చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో చిన్ననాటి జ్ఞాపకాలు, ప్రస్తుత వ్యాపకాలు, ఉద్యోగం, స్థిరనివాసాలపై ఒకరినొకరు చెప్పుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటపాటలు, నృత్యాలతో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు.