ఆదిలాబాద్ ఆట నూతన కార్యవర్గం ఎన్నిక
NEWS Dec 23,2024 04:32 am
ఆదిలాబాద్ టౌన్ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవనంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.సంఘం జిల్లా అధ్యక్షులుగా గెడం శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శిగా కుముర బాజీరావులు ఎన్నికయ్యారు. జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసి హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని త్యాగం చేసిన కొమరం భీమ్ ను స్ఫూర్తిగా తీసుకొని సంఘ పటిష్టతకు కృషి చేస్తామన్నారు.