చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
NEWS Dec 23,2024 04:35 am
మైలవరం: జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులకు అందరికీ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరనాల శివ నారాయణ తెలిపారు. ఆదివారం మైలవరం మండలంలోని వేపరాల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సభ్యత నమోదు కార్యక్రమం ఇంటింటికీ తిరిగి చేపట్టారు. శివ నారాయణ మాట్లాడుతూ.. చేనేత కార్మిక సంఘం నేతన్నల హక్కుల కోసం అనునిత్యం పోరాడుతున్నది అన్నారు.