సీఎం రేవంత్ ని కలిసిన ఎంపీ అర్వింద్
NEWS Dec 22,2024 03:56 pm
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపూరి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో నవోదయల ఏర్పాటు చేయగా నవోదయాల ఏర్పాటుకు స్థలాలు ఏర్పాటు చేయాలనీ కోరారు.
ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యేతో కలిసి సీఎంను కలిశారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్ఓబి నిర్మాణాలకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ ఓఎల్ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదించాలాన్నారు.సీఎం సానుకూలంగా స్పందించినట్లు అర్వింద్ తెలిపారు.