తిరుమల క్షేత్రం పోటెత్తిన భక్తజనం
NEWS Dec 22,2024 04:36 am
తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 72 వేల 411 మంది దర్శించుకున్నారు. 27 వేల 677 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.44 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం 14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.