క్రిష్టియన్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టిందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. బడ్జెట్ లో రూ. 150 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం క్రిష్టియన్లను పట్టించు కోలేదని ఆరోపించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశామన్నారు. క్రిస్టియన్ యువత తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.