క్రిస్మస్ వేడుకల్లో రేవంత్ రెడ్డి
NEWS Dec 22,2024 04:13 am
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ప్రయత్నం చేస్తుందన్నారు సీఎం.