సంజయ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి
NEWS Dec 22,2024 03:55 am
ఐపీఎస్ సంజయ్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫైర్ డీజీ, సీఐడీ ఏడీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‍ఫోర్స్ మెంట్ విభాగం నివేదిక సమర్పించింది. సాక్ష్యాధారాలను సమర్పించడంతో సంజయ్ ను సస్పెండ్ చేసింది. విజిలెన్స్ నివేదికను ఏసీబీకి పంపి విచారణ చేపట్టాలని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం కింద విచారించేందుకు పర్మిషన్ ఇవ్వలని సీఎస్ కు లేఖ రాసింది.