పేర్ని నాని..కిట్టుకు నోటీసులు
NEWS Dec 22,2024 03:49 am
మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్ లో రేషన్ బియ్యం మాయమైన కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విచారణలో భాగంగా తండ్రీ కొడుకులు ఇద్దరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరు. దీంతో తలుపులకు నోటీసులు అంటించారు . ఈ కేసులో నాని భార్య జయసుధ, పీఎస్ మానస తేజ ఉన్నారు.