ఎండిన చెట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS Dec 21,2024 02:11 pm
మోర్తాడ్ మండల కేంద్రంలో శనివారం సెంట్రల్ లైటింగ్ డివైడర్ లపై సుందరీకరణ, పచ్చదనం కోసం నాటిన చెట్లు ఎండిపోవడం చూసిన మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు దిగి వాటిని పరిశీలించారు. ప్రశాంత్ రెడ్డి అక్కడి నుండే మోర్తాడ్ ఎంపీడీఓకి ఫోన్ లో మాట్లాడి ప్రస్తుతం చెట్లకు సరిగ్గా నీళ్లు పట్టక చెట్లు అన్ని ఎండిపోతున్నాయని, క్రమం తప్పకుండా నీళ్లు పట్టాలని, మళ్లీ జీవం పోసుకునేల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.