మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రేవతి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రేపు చెక్కు పంపిస్తామంటూ పేర్కొన్నారు. సర్కార్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.