నీళ్లిచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
NEWS Dec 21,2024 08:26 am
గత పదేళ్ళలో నల్గొండ జిల్లాలో ఒక్క కొత్త ఎకరానికి ఆయకట్టు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేదన్నారు. కేవలం 14 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని, ఐదారుసార్లు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగిందన్నారు. తమ వద్ద లాగ్ బుక్ ఆధారాలు ఉన్నాయని చెప్పారు.