రైతు బంధు ద్వారా రూ. 80 వేల కోట్లు
NEWS Dec 21,2024 06:17 am
రైతు బంధు కింద రూ. 80 వేల కోట్లు ఇప్పటి వరకు రైతులకు సాయం అందించడం జరిగిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. తాము అధికారంలోకి వచ్చాక 7 వేల కోట్లు ఇచ్చామన్నారు..21,283 కోట్లు సాగు చేయని భూమికి కూడా బెనిఫిట్ జరిగిందని తెలిపారు. సాగు చేసే భూమికే.. రైతు బంధు ఇవ్వాలని జీవో ఉందని స్పష్టం చేశారు. రైతుబంధు లోపాలు సరిదిద్ది.. సాగు చేసే రైతుకు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు తుమ్మల .