విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈనెల 21 నుంచి 25 వరకు భవాని దీక్ష విరమణలు ఉంటాయన్నారు ఈవో రామారావు. సుప్రభాత సేవ అయిన అనంతరం దీక్ష విరమణ ప్రారంభం అవుతుందన్నారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. అన్ని ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి ఉన్నాయని అన్నారు.