గూగుల్ లో లే ఆఫ్స్ ఉద్యోగులకు షాక్
NEWS Dec 21,2024 04:54 am
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ బిగ్ షాక్ ఇచ్చింది. కొత్త ఏడాదికి ముందే కోలుకోలేని రీతిలో చావు కబురు చెప్పారు సీఈవో సుందర్ పిచాయ్. తమ సంస్థలో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో వివిధ కేటగిరీలలో పని చేస్తున్న వారు ఉన్నారని తెలిపారు. ఏఐ పోటీ మధ్య మేనేజర్ వర్క్ ఫోర్స్ ను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారని అన్నారు.