రేయింబవళ్లు గిరి పుత్రుల కోసం పని చేస్తా
NEWS Dec 21,2024 03:22 am
ఇచ్చిన మాట తప్పనని, గిరి పుత్రుల కోసం రేయింబవళ్లు పని చేస్తానని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు దశల్లో ఏజెన్సీ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పర్యాటక ప్రాంతంగా మన్యం ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందని, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. గిరిజనుల వెతలు స్వయంగా తెలుసుకొనేందుకే కొండపైకి నడిచి వెళ్ళానని చెప్పారు.