కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ స్థాయి క్విజ్ పోటీలో ఊటుపల్లి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారని ఎంఈఓ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. చింతకుంటలో స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఊట్పల్లి విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. వీరికి బహుమతులు అందించారు.