గత ప్రభుత్వ విధ్వంస పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పులు మన నెత్తిన వేసి వెళ్లారని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని అడవిబూదుగూరులో పర్యటించారు. పేదరికం లేని సమాజం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. తన పాలనా సామర్థ్యంతో ఏపీని ముందుకు తీసుకు వెళతారని అన్నారు.