బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఇవాళ తను అసెంబ్లీకి తాగి వచ్చాడని ఆరోపించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను గులాబీ ఎమ్మెల్యేలు కావాలని అవమానించారని వాపోయారు. తెలంగాణ శాసన సభలో ఇది చీకటి రోజుగా మిగిలి పోతుందన్నారు. కౌశిక్ రెడ్డికి నర నరాన కుల అహంకారం ఉందన్నారు. తక్షణమే తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని అన్నారు.