స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారికి నెలకు రూ. 120 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 1400 కోట్ల ఖర్చవుతోందని అన్నారు. ఐదేళ్లకు రూ. 7200 కోట్లు కావాల్సి ఉంటుందన్నారు. వీటితో తాండవ రిజర్వాయర్ లాంటివి మూడింటిని నిర్మాణం చేయొచ్చని అన్నారు స్పీకర్.