అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన పంజాల నీరజ్ గౌడ్ (23) అనే యువకుడు మృతి చెందగా..అదే పట్టణానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నర క్రితం ఉన్నత విద్య నిమిత్తం వీరిరువురూ అమెరికా వెళ్లారు. అమెరికాలోని న్యూహెవెన్ సిటీలో నివాసం ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తుండగా తీవ్రమైన మంచు కురుస్తుండడంతో వీరి కారు అదుపుతప్పి బోల్తా పడి నిరజ్ మృతి చెందారు.