రేషన్ మాఫియాకు కాకినాడ కేరాఫ్
NEWS Dec 20,2024 04:25 am
రేషన్ మాఫియాకు కాకినాడ కేరాఫ్ గా మారి పోయిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలోని జిల్లాలే కాదు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచీ పేదల బియ్యం అక్రమ నిల్వలు ఇక్కడికి చేరాయని స్పష్టం చేశారు. 13 కేసుల్లో 137 మిల్లుల పాత్ర ఉన్నట్లు గుర్తించామన్నారు.