కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గంగాధర్ బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.1.59 లక్షలు మాయమైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండానే బ్యాంక్ ఖాతాలో నుంచి 3సార్లు కలిపి రూ.1.59 లక్షలు డ్రా అయినట్టు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేసి అనంతరం కథలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై నవీన్ తెలిపారు.