జ్యోతిషంలో ఎంఏ పట్ట పొందిన వెంకటేశ్వర్లకు సన్మానం
NEWS Dec 20,2024 05:40 am
MA జ్యోతిష్యంలో ఉత్తీర్ణత సాధించి, జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ హైదరాబాద్ యూనివర్సిటీ ద్వారా MA జ్యోతిష్య పట్టా పొందిన, మెట్ పల్లి పట్టణానికి చెందిన తిప్పర్తి వెంకటేశ్వర్లను, మెట్ పల్లి పట్టణ స్వర్ణకార, వ్యాపార, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార, రెండు వ్యాపార సంఘాల, కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.