శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.60 కోట్లు
NEWS Dec 20,2024 03:01 am
శ్రీ వేంకటేశ్వర స్వామిని 58,165 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,377 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.60 కోట్లు వచ్చినట్లు ఈవో వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, సర్వ దర్శనానికి కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.